రైతుల పంటలను అమ్మించలేని ప్రభుత్వాలెందుకు.. మార్కెట్లెందుకు?

రైతుల పంటలను అమ్మించలేని ప్రభుత్వాలెందుకు.. మార్కెట్లెందుకు?
తెలంగాణ రైతు జే.ఏ.సి. సూటి ప్రశ్న

ఆరుగాలం కష్టపడి పండించిన పల్లికాయ పంటను మార్కెట్లలో అమ్మించలేము, రైతులు మార్కెటుకు పంటను తీసుకురావద్దని మార్కెట్ కమిటీ పిలుపునిస్తన్నపుడు ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలెందుకు. ఆ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్లు, వాటికీ పాలక వర్గాలేందుకని తెలంగాణ రైతు JAC నాయకులు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు.

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో సెప్టెంబర్ 10 నుండి 15వ తేదీ వరకు ఐదు రోజులు రైతులు తమ పల్లికాయ పంటను అమ్మకానికి తేవొద్దని మార్కెట్ అధికారులే ప్రకటించిన దానిపై స్పందిస్తూ రైతు JAC నాయకులు మార్కెట్లో పల్లి యార్డును సందర్శించారు. పల్లి రైతులతో మాట్లాడి వారికీ లభిస్తున్న ధరలను, పంటలకు అయిన పెట్టుబడి వివిరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నల్లబెల్లి మండలం నందిగామ, రంగాపురం గ్రామాల రైతులు బైరబోయిన రాజు తదితరులు మాట్లాడుతూ ఎకరాకు 17వేలు పెట్టుబడి పెట్టి పండించిన పంటను మార్కెట్ కు తెస్తే 1500 రూపాలయాలతో పలికిన ధరకు అమ్ముకుంటే 10 వేలకు మించి చేతికి రావటం లేదని, ఎకరాకు 7 వేల రూపాయలు నష్టపోతున్నామని వాపోయారు. క్వింటాలుకు 4890 రూపాయలు మద్దతు ధర (MSP) ప్రకటించిన ప్రభుత్వం ఆ ధరను మాకు అందించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయకుండా వ్యాపారుల ముందు మమ్మల్ని బలి చేస్తుందని వాపోయారు. ఇప్పటికయినా పాలకులు స్పందించి మద్దతు ధర అందచేయాలన్నారు.

యార్డును పరిశీలించిన అనంతరం నాయకులు ప్రధాన కార్యాలయానికి చేరుకొని సెక్రటరీ సంగయ్య గారితో సమావేశమై పరిస్థితులపై చర్చించి రైతుల పంటలను అమ్మించకుండా వ్యాపారుల మాటలకు మద్దతులిచ్చి రైతులను ఇబ్బందులకు గురించేయటం ఏమిటని, పల్లికాయ పంటను తేవొద్దని పిలుపునిచ్చిన మీరు తెచ్చిన పంటను ఎవరు కొంటున్నారో చూడరా అని, ఇది జీరో వ్యాపారం కాదా అని నిలదీశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు JAC రాష్ట్ర కో-కన్వీనర్ మోర్తాల చందర్ రావు, ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ కూరపాటి వెంకటనారాయణ, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు నవీన్, బీరం రాములు, తెలంగాణ రైతు JAC జిల్లా నాయకులు సోమిడి శ్రీనివాస్, ఓదెల రాజయ్య, గుండెకారి రాజేశ్వర్ రావు, మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Tolakari Monthly Magazine

Hundreds of Tenant Farmers, Women Farmers and Adivasis demand Rythu Bandhu and LEC cards

Press Release: Hyderabad, August 27, 2018

Tenant Farmers demand Rythu Bandhu and LEC cards;

Hundreds of Tenant farmers, Women farmers and other cultivators at First ever “Cultivators’ Rights Meet” at Hyderabad on August 27, 2018

For the first time, hundreds of tenant farmers, women farmers, adivasi farmers, and temple-land cultivators gathered for a “Cultivators’ Rights Meet” at Hyderabad today. Anger and outrage marked the speeches of the farmers, who castigated the Telangana government and the Chief Minister for excluding the real cultivators and giving thousands of crores in Rythu Bandhu support to non-cultivating land owners. Women farmers from farmer suicide families spoke movingly about their plight and the criminal neglect by the government. Two demands rang out clearly – that the Rythu Bandhu investment support should go to the Real Cultivators like tenant farmers and adivasi farmers; and that all tenant farmers should be given Loan and Other Eligibility Cards as per the 2011 Licensed Cultivators Act. A protest rally taken out by the farmer unions after the meet was blocked by the police.

The Meet was organized by All India Kisan Sangharsh Coordination Committee (AIKSCC) – Telangana consisting of 24 farmer organizations including all major farmer unions. The meeting was presided jointly by Kirankumar Vissa of Rythu Swarajya Vedika, Ketchela Rangayya of All India Kisan Mazdoor Sabha, T.Sagar of Telangana Rythu Sangham and K.Suryanarayana of Telangana Rashtra Rythu Sangham. Some of the important speakers were S.Malla Reddy, Vice President of All India Kisan Sabha, Justice Chandra Kumar, former High Court judge, Vemulapalli Venkatramayya of AIKMS, Pasya Padma from CPI, Nandyala Narasimha Reddy, former MLA from CPM, Vara Vara Rao of Virasam, Beeram Ramulu of Rythu Swarajya Vedika, and Sayanna of Telangana Raitanga Samiti.

Tenant Farmers Missed Call Campaign & Helpline Announced: All tenant farmers in the state were requested to participate in the Missed Call campaign by making a missed call to 040-3956-0444. Announcing the campaign, Kirankumar Vissa said, “Since the Chief Minister questions the existence of tenant farmers in Telangana, we urge every tenant farmer to give a missed call so that we can show Mr.KCR that there are lakhs of tenant farmers in the state and they are ready to demand their rights.” A helpline for tenant farmers was also launched, and farmers were urged to call 8500 98 3300 to enlist their problems.

The opening speakers in the meeting were two women who are victims of farmer suicides by tenant farmers – R.Venkatamma of Brahmanapalli village, Madugula mandal, Ranga Reddy district, and M.Swapna of Akkarajupalli, Tarigoppula mandal, Jangaon district. They expressed anger at the Telangana government at completely neglecting tenant farmers, and detailed how they got into deep debt with moneylenders leading to suicide by the farmers. Two more tenant farmers who spoke were Rapolu Narsi Reddy of Yadadri district and Md. Khaja of Gadwal district. Venkata Reddy from Shabad mandal, Ranga Reddy district shared his anguish about how 400 families in his village were
dependent on cultivating 1148 acres of temple land on lease, and they have neither received Loan Eligibility Cards nor Rythu Bandhu support despite repeated pleas to the government. Subhash Reddy from Huzurnagar mandal, Suryapet district shared about their situation cultivating temple lands on lease in their village. Yalakam Chalamayya, a tribal farmer cultivating forest lands in Kothagudem district, told the meeting that they were completely dependent on cultivating forest land for many decades, but despite the Forest Rights Act, they neither got the pattas nor any support from the government.

In the much-hyped Rythu Bandhu scheme of Telangana government, more than 20 lakh actual cultivators are not getting the benefit they are entitled to – despite being the most deserving sections to receive “Investment support for cultivation”. There are 15 lakh tenant farmers, nearly 2 lakh adivasi farmers cultivating forest lands, cultivators of temple and wakf lands, and lakhs of other small cultivators who do not have a proper land title – who have been kept out of the Rythu Bandhu scheme, while the benefit of Rs.8000 per acre is going to a few lakh non-cultivating land owners including businesspeople, employees, political leaders and even NRIs, who are not spending any money on cultivation.

The meeting ended with all the participants taking a resolve that they will wage a joint fight until they achieve their rights.

For more information contact: Kirankumar Vissa: 9701705743; Pasya Padma: 9866102497; V. Venkatramayya: 8639873720; T.Sagar: 9490098055; Sayanna: 9703223816; Achutharamarao: 9493965699; K.Ravi: 9912928422;

Field Visit – Rythubandhu Pathakam Survey

నిన్న రైతు బందు పధకం గురించి ప్రజాభిప్రాయ సేకరణకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాంతానికి వెళితే మనసును కలచివేసే సంఘటన ఒకటి ఎదురైంది. ఇలెందకుంట మండలం సిరేసేడు గ్రామానికి చెందిన జవాజి సాంబయ్య ఒక దివ్యంగుడైన కౌలు రైతు. పది సంవత్సరాలనుండి కౌలుకు చేస్తున్నాడు ఎకరా 16 వేల కౌలు చేల్లిస్తున్నాడు 2016 సంవత్సరంలో కౌలు రైతు గుర్తింపు కార్డు వచ్చింది.ఆ గుర్తింపు కార్డు మీది 20 వేల బ్యాంకు లోను వచ్చింది.2016 లో గ్రామంలో ఏ రైతుకు కుడా కనీసం పంటకుడా లేదు.సాంబయ్య కుడా 3 ఎకరాలు పత్తి వేస్తే కేవలం 5 క్వింటల్స్ మాత్రమే దిగుబడి వచ్చింది. ఆ దిగుబడి కనీసం చిన్న,చిన్న కర్చులకు కుడా సరిపోలేదు.బ్యాంకు కు వెళ్లి పంట నష్టపోయిన విషయం కుడా వివరించాడు.తన అప్పు కొంత వాయిదా వేయమన్నాడు. కాని ఏమాత్రం కనికరించని బ్యాంకు అధికారులు అతనికి వస్తున్న నెలకు 1500 వందల రూపాయల దివ్యాంగుల పెన్షన్ ను గత 8 నెలలనుండి అప్పు కిందికి జమ వేసుకుంటున్నారు. అతడు ఉపాది హామీ పనికి వెళ్ళిన కూలీ డబ్బులు ఆ అప్పు కిందికే జమ చేసుకుంటున్నారు. ఇన్ని వేల కోట్ల రుణ మాఫీ,ఇన్ని వేల కోట్ల రైతు బందు ఇటువంటి రోజు గడవటం కుడా కష్టంగా ఉన్న రైతులకు చేరకుంటే ఏమి ప్రయోజనం. సాంబయ్య లాంటి కౌలు రైతుల మీద ప్రభుత్వానికి,బ్యాంకర్లకు ఎందుకింత కనికరం లేదు.అదే గ్రామానికి చెందిన కౌలు రైతు రుద్రవేని రాములు కుడా అదే గోష.గ్రామాలలో రైతు బందు పధకం వర్తించక తీవ్ర నిరుత్సాహం లో ఉన్నారు. ఇక భూమి యజమానులు కౌలు తగ్గించిన దాకలాలు మాకు కనిపించలేదు. ఒకొక్క గ్రామంలో 30 నుండి 50 శాతం మంది కౌలు రైతులు ఉన్నారు. ప్రభుత్వం పూనుకొని కనీసం కొన్ని గ్రామాలలో నైన కౌలు రైతుల పరిస్థితి గురించి అధ్యయనం చేయిస్తే మంచిది.

Field Visit – Nennel Mandal (Mancherial Dist)

“నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో,నా సంకన మేడితో సాలిరు వాళ్ళను దున్నిననాయ్యో” ఎప్పుడో 17 సంవత్సరాల క్రితం బాల తేజస్సు లో పని చేసినప్పుడు మిత్రుడు కబీర్ నేర్పిన పాట.ఒక పిల్లవాడు పనికి పంపొదంటు వేడుకుంటున్న పాట. సరిగ్గా ఆ పాటకు సరిపోయే విధంగా నిన్న ఒక సంఘటన.అన్నా నేను పనికి పోను,రోజు ట్రాక్టర్ పనికి వెళ్ళి చేతులు, కాళ్ళు, శరీరమంతా నొప్పులు అన్నా. ఇంటిలో పరిస్థితి బాగాలేక పనికి పోతున్న కానీ ఈ నొప్పులు బరించలేనన్న,ఇక బడికి పోతానన్నాడు. ఆ వయసులో ఎలా ఏడుస్తూ పిల్లాడు బాధపడుతుంటే చాలా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. పైగా ఆత్మహత్య చేసుకున్న మా తండ్రి మమల్ని బాగా చూసుకునే వారు,మా నాన్న ఉంది ఉంటే అంటూ మళ్లీ కన్నీళ్లు. ఇక విషయానికి వస్తే మంచిర్యాల జిల్లా నెన్నెల్ మండలం మన్నే గూడ లో ఒక గిరిజన రైతు ఆత్మహత్య కుటుంబాన్ని కలిశాము.2014 లో రైతు ఆత్మహత్య జరిగితే ఇంతవరకు ఒక్క అధికారి ఆ కుటుంబాన్ని కలవలేదు. కనీస సహాయం అందలేదు. నలుగురు పిల్లలలో ఇద్దరు పనికి వెళ్తున్నారు. మరుసటి రోజు కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ ఈ కుటుంబం గురించి సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళింది.సబ్ కలెక్టర్ గారు బాగా స్పందించారు. వచ్చే సంవత్సరం పిల్లలను గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివే ఏర్పాటు చేస్తానని.ఆ కుటుంబం దగ్గరికి అధికారులను పంపించి వారికి అందేటట్టు చూస్తామన్నారు. దాదాపు ప్రతి రైతు ఆత్మహత్య కుటుంబానిది ఇదే పరిస్థితి.

Field Visit – Mancherial District

ఒక ప్రాంతంలో జరిగిన రైతు ఆత్మహత్యలలో 80% రైతు ఆత్మహత్యలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారివి నేను చూడటం ఇదే మొదటిసారి. మంచిర్యాల జిల్లా లక్సేట్టి పేట, దంతే పల్లి, నన్నెల్, చెన్నూరు మండలాలలో 15 రైతు ఆత్మహత్య కుటుంబాలను కలువగా అందులో 12 మంది”పెరిక” సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు.ఒక గ్రామ సర్పంచ్ తో మాట్లాడగా వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం అని,చాలా మంది భూములు లేక కౌలు వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు.ఈ విషయం జిల్లా కలెక్టర్,సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకు వచ్చినప్పుడు వారు వీరి అవసరాలు ఏమిటి, ఎందుకు ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయో మరింత సమగ్ర అధ్యయనం చేద్దామన్నారు.ఈ విషయం గురించి స్థానిక మిత్రులు కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది.

Field Report – Rythu Bandhu Scheme

అంబేడ్కర్ మహాశయా ఎన్ని రోజులు ఈ కౌలు రైతుల కష్టాలు.ఒక చిన్న గ్రామంలో 24 లక్షల రూపాయలు బక్క చిక్కిన కౌలు రైతులకు రావలసిన డబ్బులు ఏ మాత్రం వ్యవసాయం చేయని, అసలు గ్రామంలోనే లేని వారికి రైతు బందు రూపంలో వచ్చాయంటే ఇక ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలి, మరో 6 నెలలలో మరో 24 లక్షలు వ్యవసాయం చేయని వారికి రైతు బందు వస్తుంది. అంటే 48 లక్షల రూపాయలు వ్యవసాయం చేయని వారికి అందాయి. మరో పక్క ఎకరాకు 14 వేలు కౌలు చెల్లించే కౌలు రైతులకు రూపాయ సహాయం అందక, పంట పండుతుందో లేదో తెలియక,3 రూపాయల మిత్తికి తెచ్చిన అప్పు తీర్చలేక, అప్పల వాళ్ళ వత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులు. ఉదయం 8.30 కంతా సంగా రెడ్డి జిల్లా సదాశివ పేట మండలం పొట్టి పల్లి గ్రామం చేరుకున్నాము. మొఖంలో నెత్తురు చుక్క లేని కౌలు రైతులు. ఇక రైతు బందు గురించి మాట్లాడితే చెప్పనలవి కాని భాధలు.ఇక పూర్తి వివరాలు తెలుసుకుందామని గల్లి, గల్లి,ఇల్లు,ఇల్లు పూర్తిగా తిరిగాము. ప్రతి కౌలు రైతు కుటుంబం నోట ఒకే మాట, కష్టం మాది రైతు బందు భూ యజమానులకా అన్నా, యిదేమి న్యాయం అదే మాట ప్రతి ఇంటా వినాల్సి వచ్చింది. అధ్యయనం చేయటానికి 8 మందిమి వెళ్ళటం తో మధ్యాహ్నం 12 గంటలకంతా గ్రామం అంతా దాదాపు ప్రతి కౌలు రైతు ను కలిశాము. రైతు స్వరాజ్య వేదిక తరపున ఛాలెంజ్ చేస్తున్నాము. ఏ దర్యాప్తు సంస్థ వెళ్లి ఎంక్వయిరీ చేసిన,ఏ మీడియా మిత్రులు వెళ్ళి ఎంక్వయిరీ చేసినా సరే ఆ గ్రామంలో మొదటి విడత రైతు బందు లో వ్యవసాయం చేయని వారికి 24 లక్షలు అందాయి. మరో 6 నెలల్లో మరో 24 నాలుగు లక్షలు అందుతాయి. మిత్రులారా మీ,మీ గ్రామాలలో వ్యవసాయం చేయని వారికి రైతు బందు అందిందా, అందింటే అది ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచిచండి.

Field Visit – Kalva Srirampur Mandal

ఈ యువకుని పేరు కుమార్, 22 సంవత్సరాలు ఉంటాడు.తన జీవితమంతా తండ్రి చేసిన అప్పులకు వడ్డీ కుడా కట్టలేనని ఇక అప్పులు ఎలా కట్టేదని వణికిపోతున్నాడు.నిజానికి ఈ అబ్బాయి కోరుకుంటున్నది అప్పులనుడి విముక్తి అయితే చాలని తన కష్టం తాను చేసుకుని బతుకుతానని.అప్పుల వాళ్ళ తాకిడి ఎంతగా ఉందంటే ఉన్న చిన్న ఇల్లు కూడా అమ్మి అప్పు కట్టి ఎక్కడికైనా వెళ్దామని అనుకుంటున్నాడు. కానీ ఆ ఇల్లు అమ్మిన లక్ష రూపాయలు కూడా రావు . వివరాల లోకి వెళితే పెద్దపల్లి జిల్లా శ్రీరామ్ పూర్(కాల్వ) మండలం గంగారం గ్రామానికి చెందిన రాజయ్య ముదిరాజ్ కు వ్యవసాయ భూమి ఏ మాత్రం లేకపోవటంతో ఇతరుల దగ్గర 6 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేసుకునే వారు.ఎకరాకు ఒక పంటకు 5 క్వింటాళ్ళ వడ్లు కౌలు.10 సంవత్సరాలుగా కౌలు వ్యవసాయం చేశారు. రెండు సంవత్సరాలు వరుసగా పంట దెబ్బతిన్నది. కౌలు కట్టడానికి కూడా అప్పు చేయవలసి వచ్చింది. కొన్ని చోట్ల అప్పులు 5 రూపాయల వడ్డీకి కూడా తెచ్చాడు. ఇద్దరు బిడ్డలా పెళ్లిళ్లు చేసాడు.రెండు సంవత్సరాల క్రితం 21-02-2017 నాడు అప్పుల వారి వత్తిడి తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఈ అప్పుల విషయం ఏమి కుమార్ కు తెలియదు. మేము వచ్చామని తెలిసి అప్పుడే పొలం దగ్గరినుండి చిరిగిన బట్టలతో వచ్చాడు కుమార్. చుట్టూ ప్రక్కల మహిళలు కుమార్ పరిస్థితి గురించి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన దుస్థితి వివరిస్తున్నారు . తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి రాజయ్య రైతు ఆత్మహత్య గురించి విచారణ చేయగా, కౌలు రైతు కదా,షరా మాములు గానే రైతు ఆత్మహత్య క్రిందకు రాదు అన్నారు.వివరాలు కూడా అందుబాటులో లేవన్నారు. ఇక రైతు ఆత్మహత్య ఎక్స్ గ్రేషియా రాకపోతే ఇప్పుడు కుమార్ అప్పుల వారికి ఏమి అమ్మి అప్పు కట్టాలి, 6 లక్షల అప్పు, నెలకు 12 వేలకు పైగా వడ్డీ,రోజు ఆ తల్లి కొడుకులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.ఇలాంటి అత్యంత సంక్షోభం లో ఉన్న కుటుంబాలకు కొంత మద్దతుగా ఉండటానికి,కనీసం వీరు తమ సమస్య చెప్పుకోవటానికి కూడా గ్రామ, స్థాయిలో ఒక వ్యవస్థ లేకపోవటం బాధాకరం.

Field Visit – Chinna Pendyala Mandal

ఈ రోజు ఉదయం వర్షం చూసి ఫీల్డ్ విజిట్ జరగదనుకున్న, కానీ అనుకున్న దానికంటే బాగా జరిగింది.ఉదయం 8 గంటలకంతా జనగాం జిల్లా చిన్న పెండ్యాల గ్రామము చేరుకున్న, బాగా వర్షం కురుస్తుంది. బీరం రాము అన్న కోసం ఎదురుచూస్తున్న. అంతలోనే వెనుక నుండి కొండలన్న అని వినిపించింది చూస్తే భాగ్యక్క ( రైతు ఆత్మహత్య కుటుంబం) అక్కను అలా చూసే సరికి చాలా సంతోషం అనిపించింది.ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ఎదుర్కుని ఎప్పుడూ నవ్వుతూ ఉండే భగ్యక్కా అంటే మా అందరికీ చాలా అభిమానం, పైగా దాతలు ఇచ్చిన సహాయం సద్వినియోగం చేసుకుని (పాడి ద్వారా)ఇప్పుడు గతంలో ఉన్నంత రంది లేదని చెప్పింది.ఇక రామన్న కూడా వచ్చాడు. తర్వాత ముల్క నూర్ గ్రామంలో నాలుగు రైతు ఆత్మహత్య కుటుంబాలు దాతల చిన్న సహాయంతో గాజుల అంగడి, పిండి గిర్ని, చీరల షాప్ మొదలైనవి పెట్టుకుని ఆత్మ స్థైర్యంతో ముందుకు సాగుతున్న తీరు సంతోషం అనిపించింది.ఇక చాలా గ్రామాల వెంట కౌలు రైతుల కుటుంబాలను కలుసుకుంటూ భవిష్యత్ లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరిగే కౌలు రైతుల పోరాటాలకు సిద్దంగా ఉండాలని వివరిస్తూ వారి సమాచారం తీసుకున్నాము. చివరగా తోవలో గండి రమారం రిజర్వాయర్ చూడటం మరో అనుభూతి మిగిల్చింది.

Field Report – Gajwel Constituency

రైతు స్వరాజ్య వేదిక తరపున రైతు ఆత్మహత్య కుటుంబాలను కలుస్తూ వుండటం సహజంగా జరిగేపని,ఈ సారి ముఖ్య మంత్రి గారి స్వంత నియోజకవర్గమైన గజ్వేల్ ప్రాతంలోని జగదేవ్ పూర్,కొండపాక మండలాలలోని ఆరు రైతు ఆత్మహత్య కుటుంబాలను కలిశాము. ముఖ్య మంత్రి సారు కౌలు రైతులు ఎక్కడున్నారు అంటుంటారు.మరి ఈ ఆత్మహత్యలు చేసుకున్న రైతులంతా కౌలు రైతులే. ఒక్కొక్క కుటుంబానిది ఒక్కొక్క భాద.రాష్ట్రమంతటా అధికారులది అదేతీరు విచారణలో తీవ్ర జాప్యం,రైతు ఆత్మహత్యలుగా గుర్తించక పోవటం,దానికి గజ్వేల్ మినహాయింపు కాదు.
1.జగదేవ్ పూర్ మండలం బొప్పాయి పల్లి గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన కన్నెబోయిన మల్లేశం తనకున్న ఎకరా భూమికి తోడు 3 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు,పత్తి పంట సాగు చేసాడు. వరుసగ్గా మూడు సంవత్సరాలు నష్టం రావటం తో 28-4-2014 నాడు ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ రావటం కంటే కొద్ది రోజులు ముందు ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి కేవలం లక్ష రూపాయల ఎక్ష్ గ్రేషియా మాత్రమే వచ్చింది. ఇక మల్లేశం భార్య మంగ తన భర్త భాగానికి వచ్చే ఒక ఎకరా భూమి ఇవ్వమంటే కుడా మామా,అత్తలు,ఆ భూమి ఆమె పేరున రాసివ్వటానికి ఇష్టపడటం లేదు.చివరకు మంగ కొడుకు UKG చదువుతున్న చిన్న బాబు నంద కిషోర్ పేరున భూమి రాసారు. రైతు ఆత్మహత్య కుటుంబాల భాదితులు తమకు రావలసిన భూమి కోసం కుడా పడుతున్న కష్టాలకు ఇదొక ఉదాహరణ. గొర్రెల పంపిణి పధకం కింద ఇచ్చిన గొర్రెలు వాతావరణం అనుకూలించక చనిపోయాయి.వాటి స్థానంలో మళ్ళి గొర్రెలు వస్తాయి అంటున్నారు కాని ఇంతవరకు రాలేదు.
2. జగదేవ్ పూర్ మండలం గురవన్నపేట లో రైతు ఆత్మహత్య చేసుకున్న చింతల మహేందర్ గౌడ్ భార్య లక్ష్మి కలిసింది.లక్ష్మి అత్తగారి ఊరు జప్తి నాంచారం(కొండ పాక మండలం) భర్త ఆత్మహత్య చేసుకోవటం తో మహేందర్ తనకున్న 30 గుంటల భూమికి తోడు 4 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేసే వాడు. నీటి వసతి కోసం 3 బోర్లకు ప్రయత్నించగా 3 ఫెయిల్ అయ్యాయి. బోర్లు విఫలం కావటం, కౌలుకు కుడా అప్పు తెచ్చి కట్టటం, వరుసగా రెండు సంవత్సరాలు పంట పూర్తిగా నష్ట పోవటం అప్పులు తీర్చటానికి మహేందర్ కొన్ని రోజులు లారీ డ్రైవర్ గా కుడా పనిచేసాడు.భార్య లక్ష్మి దగ్గర ఉన్న కొంత బంగారం ICICI బ్యాంకు లో కుదువపెట్టి కొంత అప్పు తీర్చాడు . అయినా అప్పు తీర లేదు అప్పుల వారి వత్తిడి తట్టుకోలేక 11-9 2016 నాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం లక్ష్మి కి ఇద్దరు పిల్లలు,నికితేస్(4),భవ్య శ్రీ(19 నెలలు ).భాదా కరమైన విషయం ఏమంటే తన తండ్రి చనిపోయే రోజుకు భవ్య శ్రీ ఇంకా పుట్టనే లేదు.ఈ కుటుంబానికి ప్రభుత్వం నుండి ఎక్స్ గ్రేషియా అందలేదు.
3.కొండపాక మండలం కాకుల గడ్డ గ్రామానికి చెందిన చిక్కుడు మంజుల కుటుంబ పరిస్థితి మరీ దారుణం,మంజుల కూతురు అవంతిక మూడు సంవత్సరాల పాప అంటే నమ్మలేక పోయాము. తల్లి,పిల్లలు పూర్తి పోషక ఆహార లోపంతో భాదపడుతున్నారు.మంజుల భర్త శ్రీనివాస్ ఒకే ఎకరా భూమి ఉండటం తో కొంత కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసాడు,మూడు బోర్లు వేసాడు,రెండింటిలో అస్సలు నీళ్ళు పడలేదు. ఒక్క బోరులో కొద్దిగా నిల్లు పడ్డాయి, ఆ పొత్తులో బోరు కొనటానికి 55 వేలు కట్టాడు.కొద్ది రోజుల తర్వాత బౌ ఎండిపోయింది.అప్పు 2 లక్షలకు చేరుకోయింది. 18-12-2016 నాడు శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంత వరకు ఈ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా అందలేదు.
4. కొండపాక మండలం కుకునూరు పల్లి గ్రామానికి చెందిన కాగిత మహేందర్ ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేసేవారు. ఉన్న ఎకరా భూమిలో రెండు బోర్లు వేయించాడు .రెండు ఫెయిల్ అయ్యాయి .రెండు సంవత్సరాలుగా పత్తి పంటలో నష్టం వచ్చింది.అప్పులు తీర్చటం కోసం మహేందర్ కొన్ని రోజులు DCM డ్రైవర్ గా కుడా పనిచేసాడు .కాని అప్పులు తీరలేదు. 9-3-2017 నాడు ఇంటిలో ఉరి పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నారు.మహేందర్ ఆత్మహత చేసుకున్న రోజు నుండి ఆయన భార్య లక్ష్మి వారం సంతలలో మొక్క జొన్న కంకులు కాల్చి అమ్ముకుని ఇద్దరు పిల్లలను చదివించు కుంటుంది కాని ప్రభుత్వం నుండి మాత్రం ఎటువంటి సహాయం అందలేదు.
5.కొండపాక మండలం ముద్దనూరు గ్రామానికి చెందిన దళిత రైతు ఎల్లూరి కనకయ్య ఆత్మహత్య చేసుకుని 5 సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వం నుండి ఇంతవరకు ఎటువంటి సహాయం అందలేదు.ఎకరా భూమి కుడా గుడ్డం పత్తి దిగుబడి రాలేదు.కుటుంబ పోషణ కుడా కష్టం అయ్యింది.
6. చివరగా జగదేవ్ పూర్ మండలం మూడు గడపల పల్లె గ్రామానికి చెందిన చెందిన ఆత్మహత్య చూసుకున్న రైతు రోషిని లక్ష్మయ్య భార్య వినోద మాత్రం సమస్యలు వచినప్పుడు ధైర్యంగా ఎడుర్కొవాలికాని కాని ఆత్మహత్య చేసుకుని కుటుంబాలను మరింత సమస్యలోకి నెట్టవద్దు అని తన మాటగా చెప్పింది
అయిన ఏ కుటుంబానికి కుడా ఆహార భద్రత క్రింద అంత్యోదయ కార్డు కుడా అందలేదు. రాష్ట్రంలోనే ఎంతో గొప్పగా చెప్పుకునే డబల్ బెడ్ రూమ్ ఇల్లులు ఈ కుటుంబాలలో ఏ ఒక్క కుటుంబానికి అందలేదు.